మనసున మనసై : దేవీ పట్నం (తెలుగు)
--లక్ష్మీ రాజ్
‘ తిరుపతి వెంకన్న ’ అని అంటాడు తెలుగువాడు ఎవడైనా , మీ కుల దైవం ఎవరు అని అడిగితే. మనవాళ్ళలో కళ్యాణచక్రవర్తి కి ఉన్న పాపులారిటీ అటువంటిది మరి. అలాగే తెలుగోళ్ళకి రాముడన్నా అమిత ప్రీతీ . అసలు కాశి రామేశ్వరం వెళ్లి వస్తే గానీ ముక్తి రాదు అని ఓ తరఫు ఆంధ్రుల నమ్మకం. పెళ్లి కాంగనే తిరుపతితో పాటు రామేశ్వరం వెళ్లి సముద్రంలో స్నానం చేసి శివుణ్ణి (రామనాథ స్వామి) కొలిస్తే కొడుకు పుడతాడని చాలామంది తెలుగువారి నమ్మకం అనాదిగా . రామేశ్వర సముద్ర జలంతో కాశీ విస్వేస్వరుడికి అభిషేకం చేసి , ఆ చేత్తోనే గంగా జలం తెచ్చి రామేశ్వరములో అభిషేకం చేస్తే పునర్జన్మ వుండతు అని పెద్ద వాళ్ళ నమ్మకం.
అబ్బో అది అసలే అరవదేసం ఎంత దూరమో అనిపించినా చాలామందే రామేశ్వరం వెళ్తారు . ఆ రామేశ్వరం దార్లో రామయణ పురాణానికి రాముడికి సంబంధించినవే గాక చూడతగిన స్థలాలు ఎన్నో . ఒకసారి చూస్తే మన బంధువులందరికీ చెపుతాం .
అట్లాంటి వాటిల్లో : రామనాధపురం టౌన్ కి :
ఉత్తరాన : దేవీపట్నం
తూర్పున : విల్లున్దితీర్థం
దక్షిణాన : సేతుకరై , తిరుపులని , ఉతరకోసిమంగై
అలాగే మరెన్నో . వాటిల్లో కొన్ని క్షేత్ర విశేషాలు చూద్దామా!
అలా రామేశ్వరం వెళ్ళే దార్లో రామనాధపురం జిల్లా కేంద్రం రామనాథపురం వస్తుంది . అక్కడ దిగి ఓ పది కి. మీ. లు ఉతరంగా వస్తే (టౌన్ బస్సులు , టాక్సీలు ఉన్నాయి లెండి .) దేవీ పట్నం వస్తుంది. అక్కడ సముద్రంలో అంటే ఒడ్డుకు ఇరవై ముఫై అడుగుల్లో నవ గ్రహాల విగ్రహాలుంటాయి . వాటి దగ్గరకి వెళ్లేందుకు నీళ్ళ మట్ట్ట్టం మీద ఒక సిమెంటు ప్లాట్ఫారం కూడా ఉంది లెండి బ్రిడ్జి లాగ . ఉదయం పది లోగా వెళితే దర్శించ వచ్చు . ఆలస్యం అయితే ఆటు వచ్చి నీటి మట్టం పెరుగుతుంది . అప్పుడు గుండెల్లోతున నీళ్ళలో ఉన్న క్రింద ప్లాట్ఫారం మీద గాని నీళ్ల పైన బాటలో ప్యాంటు తడవకుండా నిలబడి గాని పూజ జరిపించ వచ్చు. ఉదయాన్నే పది పదకొండు లోగా వెళ్తే మడమలు తడిసే లోతులో సముద్రంలో ప్రదక్షిణం చేసి పూజ చెయ్యాలి . రైలింగ్లూ అవీ వున్నాయి భయం లేదు . సముద్రం గూడా ప్రశాంతంగా ఉంటుంది. నవగ్రహదర్శనం చేసి రండి చాల శక్తిగల క్షేత్రమని గ్రహదోషాలు తొలిగి పెళ్ళిళ్ళు , పిల్లలు గృహ చ్చిద్రాల నాశనము వంటి కోరికలు తీరుతాయి అని నమ్మకం .
Ø గమనిక : చెన్నై ఎగ్మోర్ నుండి సేతు ఎక్ష్ప్రెస్స్ , రామేశ్వరం ఎక్ష్ప్రెస్స్ లలో రామనాధపురం దిగోచ్చు . పన్నెండు గంటల ప్రయాణం. చెన్నై కోయంబేడు నుండి గూడ గంటకో బస్సు , ప్రక్కన టూరిస్ట్ ఒమిని బస్సు లు . లేదా ఇటు మదురై వెళ్తే మదురై నుండి రామాధపురం మూడు నాలుగ్గంటల ప్రయాణం. మదురై నుండి టాక్సీ గూడ తీసుకొని వెళ్ళొచ్చు.
లక్శ్మీ రాజ్
No comments:
Post a Comment