Tuesday, May 26, 2009

Manasuna manasai: Telugu lo Chaduvulu-I

మనసున మనసై : తెలుగులో చదువులు -౧

లక్ష్మీ రాజ్

‘ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయికా ----’ అనే పాటని ఎవరు ఒప్పుకున్న్నా ఒప్పుకోక పోయినా ప్రవాసాంధ్రులు మాత్రం ఒప్పుకుంటారు .
ఎనభైల్లో అనుకుంట , వేరే సందర్భంలో ఆంద్ర ప్రభ జవాబుల్లో మాలతీ చందూర్ గారు ‘ప్రవాసాంధ్రులు అంటే మీరు కాదు దూఒర దూర దేశాల్లో ఉంది తపించే తెలుగువాళ్ళు ప్రవాసాంధ్రులు .’అన్నారు . అయితే తనివితీరా తెలుగు మాట్లాడడం చదవడంకి లేకపోవడం , తెలుగు ఎప్పుడోగాని వినడానికి అవకాసం రాకపోడం (ఇంట్లో తప్పితే ) లాంటి కష్టాలు పడే ఆంధ్రులంతా (తెలుగు చానళ్ళు వచినా సరే ) ప్రవాసాంధ్రులే అంటాను నేను .

అల్లాగే సంభాషణ చెయ్యాల్సిన అవసరం లేకపోతే ప్రవాసాంధ్రులు కూడా తెలుగు పదాలు మర్చిపోతారు .
ఏ చెన్నై , బెంగుళూరులో ఉన్నా సరే ఏ సంవత్సరానికి ఒక్క సారి గూడ, ఆంధ్రా కి రాలేక పొయ్యే వాళ్ళు - తిరుపతికో తప్పిస్తే - బంధువులు ఇంటికి రాగలిగినప్పుడు వాళ్ల సంతోషం (ప్రవాసాన్ద్రులది - భందువులది అటో ఇటో చెప్పలేం గదా!). రేలంగి పాటలో చెపితే ‘అది అనుభవించితే తెలియునులే భలే చాన్సులే --’(ఇల్లరికం ).
తిరుపతికి ఎక్సెప్షన్ ఎందుకంటే - మనం మనం ఉండే దేశం రైల్లో లేక బస్సులో వస్తాం , వెళ్తాం . కొండమీద అన్ని భాషలూ కిచిడి లాగ విన్పించి మనకు అలవాటయిన భాషలో ప్రకటనలు చదివించి లేక వినిపించి పబ్బం గడు స్తుంది . అందుకని తెలుగుత్వం రసాస్వాదన (కొన్ని కొన్ని సార్లు చేదు రసంగూడ -ఎమ్చేస్థం మరి .) తిరుపతికి మాత్రం వచ్చి వెళ్ళితే ఉండదు అంటాన్నేను .
మరి ఇండియా తెలుగు వాళ్ల సంగతి ఇలా ఉంటే విదేశాల్లో వాళ్ల సంగతి ? అమెరికా , ఇంగ్లాండు , ఆస్ట్రేలియా , ఫ్రాన్స్ , ఒకరకం గల్ఫ్ ఒకరకం .వీరికి ఇండియన్ లో వాళ్ల సాముహిక సంబరాలు దొరుకుతవి .తెలుగు వాళ్లు గూడా అప్పుడప్పుడు కలవ్వోచ్చు .కొంత మంది అధ్రుష్టవంతులకు బంధువులు గూడ ఉంటారు . జపాన్ యూరపు దేశాల్లో వాళ్ల సంగతి మరోరకం …అక్కడి ప్రజలు ఆదరించి కలుపు కుంటారు. ఇందియనుల తోటి ప్రవాసాంధ్రులు ఎప్పుడో ఒక్కసారి కలుస్తారేమో !
కెన్యా లాంటి ఆఫ్రికా , ఆసియా దేశాల్లో ప్రవాసాంధ్రులు ? ఆంధ్రులు అని మురిసిపోతారు గానీ వీళ్ళకు తెలుసు వారు మాట్లాడేది తెలుగు లాంటిధీ అని. పేర్లు ఆయా దేశం సంబంధిచిన దేశాలకి మన తెలుగు అలవాటులు మేకుప్ వేసుకున్నట్లు అనిపిస్తుంది. ఇది వాళ్ళని ఎగతాళి చెయ్యడం కాదు. ఉండే పరిస్థితి అది మరి. కొన్ని సార్లు వాళ్ళని కలిసినపుడు "............ అయినా మనిషి మార లేదు ఆతని మనసు మారలేదు ...." అని అనిపించడం కద్దు. అన్నట్లు వాళ్లు తెలుగు వాళ్ళం అని మురిసి పోదాం మార లేదు, మన తెలుగు జనరాసిట్టి మన అందరి రక్తములో ఉంది అన్నది నిజం.

రాబిన్సన్ క్రుస్సో ఒంటరిగా ద్వీపంలో గడిపినప్పుడు క్రమక్రమంగా వొక్కో పదం మరిచి పోవడం గమనించి తనలో తనే మాట్లాడడం ప్రారంభించాడట , మూగ వాడి ని అవుతానేమో అని భయమేసి .
పై విభాగాల్లో ఏ రకానికి చెందిన ప్రవసాన్ద్రులైన కొన్ని ఆవేశాలూ , ఆకాంక్షలు common. చాల రోజులు తెలుగు లో మాట్లాడకపోతే పండితులు సైతం పదాలని , ప్రయోగాలని మరిచిపోడం – ఇది తెలుగా లేక మనం ఉంటున్న ఊరి భాష లో పదమా అన్నా సందేహం ఇండియా universityలో చదివి వో పదేళ్ల ఉద్యోగం వెలిగించిన వాళ్ళకే వస్తుంది . ఇంకొక ప్రబలమైన ఆస అయ్యో మన పిల్లలకైనా తెలుగు నేర్పించగాలిగితే , మన సాంఘిక భావాలు , పురాణాలు వగైరా ఆ తరానికి అందించ గలిగితే అని.

రామాయణం ఎన్ని భాషల్లో ఆ దేశాల్లో దొరికినా తెలుగు రామాయణం లో భావోద్వేగం భక్తి పరవశం మనదైన

ఇంటర్ ప్రీ టషన్ ఇతర బాషలలో ఉన్నా రామాయణం లో దొరకదు గదా. ' బాపు సీత కల్యాణం, సంపూర్ణ రామాయణం, భక్త కన్నప్ప' ల అనుభూతి తర్జుమా లో వస్తుందా ?

సాగర సంగమం లో విశ్వనాధ్ తో మాట్లాడినట్లు ఉంటుంది. అది ఆ తృప్తి ఒకటే టైం లో సంబాషణలు రాసి తీసినా

ఆ డబ్బింగు లో దొరకదు కదా. ఏదో వెలితి. ' నండూరి పడవ' లో అన్నట్లు ' దేవుడల్లె లోన .... గుండె గొంతు క లోన ..' అన్నట్టు ఏదో వెలితి.

మరి తీరేదేట్టగా?

అస్సలు తెలుగు రాయడం రాని తెలుగోన్నని గరవంగా చెప్పు కొనే ఓ ( ఆరవ ) తెలుగతను అమెరికాలో అడిగాడు ' హిందీ ప్రాధమిక వంటి తెలుగు కోర్సులు ఎందుకు లేవు అని ?

ఆసియన్లకు తగినట్లు, గల్ఫ్ అన్నలకు తగినట్లు అమెరికన్లకు తగినట్లు యురోపోల్లకి తగినట్లు వాళ్ల నాగరికతకి సౌకర్యానికి సోఫిస్తికాషనుకు తగినట్టు విద్యా కాలాన్ని స్తాన్దర్డును ఆయా దేశాల్లో తెలుగు చెప్పాలి అనిపించదు అని ?

తెలుగు సంస్కృతిని కాపాడే భాద్యత ప్రవాసాంధ్రుల వ్యక్తిగత బాద్యత గా గృహ విద్య గ ఎందుకు వదిలేయాలి అని నిలద్దీసాడు.

'ఎవడి గోల వాడిది' అని వదిలేయ్యద మేనా లేక ' వినదగు నెవ్వరు చెప్పిన ..' అని ఆంధ్ర ప్రభుత్వము, తరచుగా విదేశాల్లో యుగళ గీతల పేరుతో గంతులేయ్యడానికి వెళ్ళే తెలుగు సినిమా వొళ్ళు లాంటి వారు పూను కొంటారా?

'ఆశలు తీరని ఆవేదనలో నిన్ను నిన్ను గ.....' అని ప్రవాసాంధ్రుల దరిచేరుతమా ?

లక్ష్మీ రాజ్

Monday, May 11, 2009

మనసున మనసై : దేవీ పట్నం

మనసున మనసై : దేవీ పట్నం (తెలుగు)

--లక్ష్మీ రాజ్

‘ తిరుపతి వెంకన్న ’ అని అంటాడు తెలుగువాడు ఎవడైనా , మీ కుల దైవం ఎవరు అని అడిగితే. మనవాళ్ళలో కళ్యాణచక్రవర్తి కి ఉన్న పాపులారిటీ అటువంటిది మరి. అలాగే తెలుగోళ్ళకి రాముడన్నా అమిత ప్రీతీ . అసలు కాశి రామేశ్వరం వెళ్లి వస్తే గానీ ముక్తి రాదు అని ఓ తరఫు ఆంధ్రుల నమ్మకం. పెళ్లి కాంగనే తిరుపతితో పాటు రామేశ్వరం వెళ్లి సముద్రంలో స్నానం చేసి శివుణ్ణి (రామనాథ స్వామి) కొలిస్తే కొడుకు పుడతాడని చాలామంది తెలుగువారి నమ్మకం అనాదిగా . రామేశ్వర సముద్ర జలంతో కాశీ విస్వేస్వరుడికి అభిషేకం చేసి , ఆ చేత్తోనే గంగా జలం తెచ్చి రామేశ్వరములో అభిషేకం చేస్తే పునర్జన్మ వుండతు అని పెద్ద వాళ్ళ నమ్మకం.
అబ్బో అది అసలే అరవదేసం ఎంత దూరమో అనిపించినా చాలామందే రామేశ్వరం వెళ్తారు . ఆ రామేశ్వరం దార్లో రామయణ పురాణానికి రాముడికి సంబంధించినవే గాక చూడతగిన స్థలాలు ఎన్నో . ఒకసారి చూస్తే మన బంధువులందరికీ చెపుతాం .
అట్లాంటి వాటిల్లో : రామనాధపురం టౌన్ కి :
ఉత్తరాన : దేవీపట్నం
తూర్పున : విల్లున్దితీర్థం
దక్షిణాన : సేతుకరై , తిరుపులని , ఉతరకోసిమంగై
అలాగే మరెన్నో . వాటిల్లో కొన్ని క్షేత్ర విశేషాలు చూద్దామా!
అలా రామేశ్వరం వెళ్ళే దార్లో రామనాధపురం జిల్లా కేంద్రం రామనాథపురం వస్తుంది . అక్కడ దిగి ఓ పది కి. మీ. లు ఉతరంగా వస్తే (టౌన్ బస్సులు , టాక్సీలు ఉన్నాయి లెండి .) దేవీ పట్నం వస్తుంది. అక్కడ సముద్రంలో అంటే ఒడ్డుకు ఇరవై ముఫై అడుగుల్లో నవ గ్రహాల విగ్రహాలుంటాయి . వాటి దగ్గరకి వెళ్లేందుకు నీళ్ళ మట్ట్ట్టం మీద ఒక సిమెంటు ప్లాట్ఫారం కూడా ఉంది లెండి బ్రిడ్జి లాగ . ఉదయం పది లోగా వెళితే దర్శించ వచ్చు . ఆలస్యం అయితే ఆటు వచ్చి నీటి మట్టం పెరుగుతుంది . అప్పుడు గుండెల్లోతున నీళ్ళలో ఉన్న క్రింద ప్లాట్ఫారం మీద గాని నీళ్ల పైన బాటలో ప్యాంటు తడవకుండా నిలబడి గాని పూజ జరిపించ వచ్చు. ఉదయాన్నే పది పదకొండు లోగా వెళ్తే మడమలు తడిసే లోతులో సముద్రంలో ప్రదక్షిణం చేసి పూజ చెయ్యాలి . రైలింగ్లూ అవీ వున్నాయి భయం లేదు . సముద్రం గూడా ప్రశాంతంగా ఉంటుంది. నవగ్రహదర్శనం చేసి రండి చాల శక్తిగల క్షేత్రమని గ్రహదోషాలు తొలిగి పెళ్ళిళ్ళు , పిల్లలు గృహ చ్చిద్రాల నాశనము వంటి కోరికలు తీరుతాయి అని నమ్మకం .

Ø గమనిక : చెన్నై ఎగ్మోర్ నుండి సేతు ఎక్ష్ప్రెస్స్ , రామేశ్వరం ఎక్ష్ప్రెస్స్ లలో రామనాధపురం దిగోచ్చు . పన్నెండు గంటల ప్రయాణం. చెన్నై కోయంబేడు నుండి గూడ గంటకో బస్సు , ప్రక్కన టూరిస్ట్ ఒమిని బస్సు లు . లేదా ఇటు మదురై వెళ్తే మదురై నుండి రామాధపురం మూడు నాలుగ్గంటల ప్రయాణం. మదురై నుండి టాక్సీ గూడ తీసుకొని వెళ్ళొచ్చు.

లక్శ్మీ రాజ్